క్రైమ్/లీగల్

బీఆర్‌టీఎస్ రోడ్డులో స్కూలు బస్సు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 22: వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. అదృష్టం బావుండటంతో పెనుప్రమాదం తప్పి ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాన్ని కలుగచేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారుతీనగర్‌లోని చైతన్య స్కూలుకు చెందిన బస్సు రాజీవ్‌నగర్‌లోని విద్యార్థులను ఎక్కించుకుని స్కూలుకు తీసుకెళ్తోంది. బీఆర్‌టీఎస్ రోడ్డులో శారదా కళాశాల సిగ్నల్ జంక్షన్ వద్దకు వచ్చే సరికి అకస్మాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో బస్సు డ్రైవర్ దుర్గాప్రసాద్ ఎంత ప్రయత్నించినా అదుపుకాని బస్సు ఎదురుగా వస్తున్న ఫ్రూట్స్ బండిని ఢీకొట్టింది. దీంతో వివిధ రకాల పండ్లు బండితో సహా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతటితో ఆగని బస్సు ఓ ఆటోను ఢీకొట్టడంతో అది తిరగబడిపోయింది. ఇదే వేగంతో బస్సు ఓ బుల్లెట్‌ను కూడా ఢీకొంది. ఈఘటనలో మస్తాన్ వలీ అనే పండ్ల మర్చంట్‌తోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. బుల్లెట్‌ను ఢీకొట్టిన బస్సు ఎట్టకేలకు వేగం తగ్గి ఆగిపోయింది. బస్సులోని దీనితో విద్యార్థులు, స్థానికులు, రోడ్డుపై వెళ్ళే వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న సత్యనారాయణపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. బస్సును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.