క్రైమ్/లీగల్

300 కార్లు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 23: కర్నాటకలోని ఎలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌షో వద్ద సందర్శకుల వాహనాల పార్కింగ్‌వద్ద జరిగిన ప్రమాదంలో 300 వాహనాల దగ్ధమయ్యాయి. బెంగళూరు శివారు ఎలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏషియా ప్రీయర్ ఎయిర్‌షో ఏర్పాటుచేశారు. షో చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. సందర్శకులు పార్కింగ్ ఏరియాలోనే వాహనాలు నిలిపారు. ఆ ప్రాంతంలో ఎండుగడ్డి పరచిఉండడం, ఎండ, తీవ్రమైన గాలుల వల్ల మంటలు లేచాయని అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు పార్కింగ్ స్థలం చాలా దూరంలోనే ఏర్పాటు చేశారు. 12వ ఎయిర్ ఏషియాషోలోఈ అపశృతి చోటుచేసుకుందని వారనాన్నారు. రెండ్రోజుల్లో షో ముగియనుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. ఇలా ఉండగా రెండు రోజుల క్రితమే ఎయిర్‌షోలో రెండు విమానాలు ఢీకొన్నాయి. గగనతంలోనే చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ పైలెట్ దుర్మరణం చెందారు. మొదటి రోజే జరిగిన ఈ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కాగా అగ్నిప్రమాదం ఉదయం జరిగినందున మధ్యాహ్నం కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదని రక్షణశాఖ పీఆర్‌వో హెచ్‌ఎల్ గురుప్రసాద్ వెల్లడించారు. ఆదివారం ఆఖరి రోజు కావడంతో కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పార్కింగ్ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఇది సందర్శకులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు గురిచేసింది. గత మూడురోజులు విదేశీ ప్రతినిధులు, వాణిజ్యవేత్తలు, మీడియా ప్రతినిధులు, ఆహ్వానితులను మాత్రమే అనుమతించిన అధికారులు, శనివారం ప్రజలకు అవకాశం కల్పించారు.‘300 కార్లు దగ్ధమయ్యాయి. ఎవరూ గాయపడలేదు’అని ఆయన తెలిపారు. 10 ఎయిర్‌ఫోర్స్, ఐదు మిగతా విభాగాలు అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను ఆర్పేశాయి. ఎండుగడ్డే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశించారు. ఉదయం 11.55కి ప్రమాదం చోటుచేసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.