క్రైమ్/లీగల్

డాక్టర్‌కు రూ.5.50 లక్షల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రికి చెందిన వైద్యుడు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఆనారోగ్యం, మనోవేదనకు గురైన బాధితురాలికి వినియోగదారుల ఫోరమ్ న్యాయం చేసింది. బాధ్యుడైన వైద్యుడి నుంచి బాధితురాలికి రూ.5.50 లక్షల పరిహారాన్ని ఇప్పించింది. ఈ మేరకు శనివారం పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్ సబర్వాల్ నష్టపరిహారాన్ని బాధితురాలికి అందజేశారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ సైదాబాద్‌కు చెందిన మరియా సబ అనే పేరుగల మహిళా డిసెంబర్ (2017) నుంచి ఒక ప్రముఖ ఆస్పత్రికి వచ్చి నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంది. అదే ఆస్పత్రిలో సదరు మహిళాకు ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగింది. తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చి బాధితురాలు అనారోగ్యానికి గురైందని నమ్మించి వేరే ఆస్పత్రికి పంపించారు. అంతకుముందు వైద్యం చేసిన వైద్యుడి నిర్లక్ష్యం వల్లనే సదరు మహిళా అనారోగ్యానికి గురైందని వారు రోగి కుటుంబ సభ్యులకు తెలిపారు. బాధితురాలి భర్త వైద్యుడి నిర్లక్ష్యంపై తెలంగాణ వినియోగదారుల సలహాయ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైద్యుడి నిర్వాకం వల్ల తమకు రూ. 3 లక్షలు ఖర్చు అయిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును విచారించిన వినియోగదారుల సహాయ కేంద్రం వైద్యుడికి లీగల్ నోటిసులు జారీ చేసింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా బాధితురాలు అనారోగ్యానికి గురైందని తేలడంతో సదరు వైద్యుడికి రూ.5.50 లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని వినియోగదారుల సహాయ కేంద్రం జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలికి శనివారం అందజేసినట్టు అకున్ సబర్వాల్ తెలిపారు.