క్రైమ్/లీగల్

ఈత కొలనులో పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 23: ఈత నేర్చుకోవడానికి వచ్చి ఈత కొలనులో మునిగి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లి వద్ద ఏ టూ జడ్ ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి శనివారం ఈత నేర్చుకోవడానికి వచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్‌లో కోచ్ లేకపోవడంతో అక్కడ సరైన నిర్వాహణ లేని కారణంగా ఖాజా స్వతహాగా ఈత నేర్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రమాదవశాత్తు మహ్మద్ ఖాజా నీటిలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో స్విమ్మింగ్ ఫూల్‌లో కోచ్ లేకపోవడం వల్లనే తమ కుమారుడు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో స్విమ్మింగ్ ఫూల్ యజమాని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.