క్రైమ్/లీగల్

కల్తీ నెయ్యి తయారీదారుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదినేపల్లి, మార్చి 12: ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని మంగళవారం ముదినేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి ముడి సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వైవాక గ్రామానికి చెందిన ఆత్మూరి రామాంజనేయులు (50) గత కొంత కాలంగా కల్తీ నెయ్యి తయారు చేయటంతో పాటు విక్రయాలు సాగిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న రామకృష్ణ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. అతని నుండి 25కేజీల నెయ్యి, ముడి సరుకును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.