క్రైమ్/లీగల్

పాఠశాల ఫీజులపై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: పాఠశాలల ఫీజులను భారీగా పెంచడంపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్ (149/2016)పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఈ దశలో ఏమీ చేయలేమని, అనేక కేసులు, స్టే ఉత్తర్వులు ఉన్నందున ఫీజుల నియంత్రణకు సంబంధించి ముందుకు వెళ్లలేకపోతున్నామని పేర్కొనడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ తీవ్రంగా స్పందించింది. స్టే ఉత్తర్వులున్న అన్ని కేసులను ఒక బ్యాచ్ కింద విచారణ చేపడతామని పేర్కొంటూ తదుపరి విచారణను మార్చి 26కు వాయిదా వేసింది. ప్రభుత్వం 2010లో జారీ చేసిన జీవో 42 ప్రకారం జిల్లా స్థాయిలో ఫీజుల రెగ్యులేటరీ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, అది ఇంత వరకూ జరగలేదు, ఇందుకు సంబంధించిన పలు కేసుల్లో స్టే ఉత్తర్వులు ఉండటంతో ఇది సాధ్యపడలేదని ప్రభుత్వం పేర్కొంది. అడ్మిషన్ సమయంలో 5వేలకు మించి రకరకాల పేర్లతో అదనపు ఫీజును స్కూళ్లు వసూలు చేస్తున్నాయని, ఈ విధానంపై స్పష్టత ఉండాలని, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇది ఉల్లంఘించడమేనని పేర్కొంటూ 2009లో జారీ చేసిన జీవో 91ని అమలుచేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ కోరింది, దానిపైనా విచారణ కొనసాగుతోంది. ఇంక పక్క ఫీజులను పెంచరాదని పేర్కొంటూ ప్రభుత్వం గత ఏడాది జనవరి 4న జారీ చేసిన మెమోపైనా కొన్ని కేసులు దాఖలయ్యాయి. ప్రధానంగా ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజిమెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన రిట్ పిటీషన్ 1331/2018పై ఇంకా విచారణ కొనసాగుతోంది. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హెచ్‌ఎస్‌పీఏ నేతలు సీమ, పవన్, రమణ్ జీత్, వెంకట్‌లు హర్షం వ్యక్తం చేశారు.