క్రైమ్/లీగల్

పొలం వద్ద విద్యుదాఘాతంతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధారి, మార్చి 12: పశువుల కోసం పచ్చిగడ్డిని కోసుకుని తిరిగి వస్తుండగా పచ్చిగడ్డి మోపు 11 కేవి విద్యుత్ తీగలకు తగలడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్ తండాలో సోమవారం సాయంత్రం జరుగగా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఎస్‌ఐ సత్యనారాయణ, తండావాసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. తండాకు చెందిన జరుప్లా కుమార్ (22) అనే యువకుడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడని తెలిపారు. సోమవారం సాయంత్రం గుజ్జుల్ డ్యాం అంచున పచ్చగడ్డిని కోసేందుకు వెళ్లాడని వివరించారు. గడ్డిని తీసుకుని వస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఆలస్యంగా కుమార్ మృతి చెందిన విషయాన్ని గమనించిన మొక్కజొన్న పంట యజమాని కుమార్ మృతదేహాన్ని పక్కనే ఉన్న మోజీరాంకు చెందిన మొక్కజొన్న పంటలో పడేశాడన్నారు. ఈ విషయాన్ని తాండావాసులకు చెప్పకుండా మొక్కజోన్న పంట యజమాని కుటుంబ సభ్యులతో పాటు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఇక గడ్డికోసం వెల్లిన కుమార్ సోమవారం రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన అతని కుటుంబ సభ్యులు తాండా వాసులు, బంధువులు అతని కోసం రాత్రంతా గాలించినా ఫలితం లేకుండా పోయిందని వివరించారు. సోమవారం ఉదయం కుమార్ గడ్డికోసం వెల్లిన విషయాన్ని చిన్నపిల్లాడి ద్వారా తెలుసుకున్న కుకుంబ సభ్యులు వెతకడంతో చెప్పులు కనిపించాయన్నారు. అనంతరం వెతకగా మోజీరాం పంటచేనులో శవం కనిపించడంతో తాండా వాసులు ముందుగా రవి ఇంటితో పాటు మోజీరాం ఇళ్లపై దాడి చేశారు. కుమార్ మృతి చెందిన విషయాన్ని తెలిసినప్పటికీ మోజీరాం తమకు చెప్పలేదని ఆగ్రహంతో అతనిపై కూడా దాడి చేయడంతో ఆయనకు గాయాలైనాయి. దీంతో తాండాలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనంతరం తండా వాసులను శవం వద్ద నుండి దూరంగా పంపించివేశారు. అనంతరం విషయాన్ని ఎల్లారెడ్డి సీఐ సుధాకర్‌కు సమాచారం అందించడంతో పోలీసులు బలగాలతో తాండాకు చేరుకున్నారు. శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు కుమార్‌కు గత 15 రోజుల క్రితమే వివాహం జరిగిందని తాండా వాసులు బోరున విలపించారు. మృతుని భార్య సొమ్మసిల్లి పడిపోవడంతో ఆమెను తాండా వాసులు ఆసుపత్రికి తరలించారు.