క్రైమ్/లీగల్

భారీగా మాదక ద్రవ్యాలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: విద్యాసంస్థలనే టార్గెట్‌గా చేసుకుని మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిందితుల నుంచి కొకైన్, హెరాయిన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ దాదాపు కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. నేరేడ్‌మెట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంగా నలుగురు ముఠా సభ్యులను చాకచక్యంగా పట్టుకున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో కొంత కాలంగా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందన్నారు. కొకైన్, హెరాయిన్‌లను ఇతర దేశాలను నుంచి తెచ్చి అమ్మకాలు చేస్తారన్నారు. అరెస్టు అయిన నలుగురు వ్యక్తులు ఆంధ్రాకు చెందినవారేనని కమిషనర్ తెలిపారు.

చిత్రం.. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్