క్రైమ్/లీగల్

ఒడిసాలో ఎదురు కాల్పులు మహిళా మావోయిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, మార్చి 13: మావోయిస్టులు - పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మహిళా మావోయిస్టు మృతి చెందింది. సంఘటనా స్థలంలో లభించిన భారీ ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం కందమాన్ జిల్లా తుండిబంద అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో బుధవారం స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ , డిస్ట్రిక్ట్ వలంటీరీ ఫోర్స్ సంయుక్తంగా తుండిబంద అటవీ ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు పోలీసుల రాకను గమనించారు. దీంతో ఒక్కసారిగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు మావోలపై ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు గంటకు పైగా ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో మహిళా మావోయిస్టు మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరిసర ప్రాంతాలను పరిశీలించగా నాలుగు తుపాకీలు, మూడు గ్రైనేడ్లు, ఇతర సామగ్రి లభ్యమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల నుండి తప్పించుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోల కై పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా రాష్ట్రానికి తరలించారు. అనంతరం తుండిబంద అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించి కూబింగ్ నిర్వహిస్తున్నట్లు ఒడిశా అడిషనల్ డీజీ ఆర్‌పీ తెలిపారు.
చిత్రం.. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మహిళా మావోయిస్టు