క్రైమ్/లీగల్

తహశీల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, మార్చి 13: ఏసీబీ అధికారులు మల్దకల్ తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్‌ఏ చెన్నయ్య రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి విదితమే. బుధవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో హైదరాబాద్ ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్, నల్గొండ డిఎస్పీ ఆనంద్‌కుమార్, మహబూబ్‌నగర్ డిఎస్పీ కృష్ణగౌడుల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ గదులలోని బీరువాలను అధికారులు సోదాలు చేయగా బిజ్వారం, మల్దకల్ వివిధ గ్రామాలకు చెందిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు దాదాపు వందకు పైగా లభ్యమయ్యాయి. 2018 ఆగస్టులో వచ్చిన పాస్‌పుస్తకాలు రైతులకు పంపిణీ చేయకుండా వీఆర్‌ఏ, వీఆర్‌వోలు తహశీల్దార్ కార్యాలయంలో ఉంచుకొని రైతులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాస్‌పుస్తకాల పనినిమిత్తం ప్రతిరోజు కార్యాలయం వద్ద పడిగాపులుకాసినా అధికారులు పనిచేయక పోవడం వల్ల రేపు మాపు అంటూ కాలంవెల్లదీస్తూ వచ్చారు. పుస్తకాలు ఎన్ని వచ్చాయి? రైతులకు ఎన్ని ఇచ్చారు? అనే దానిపై అధికారులు ఆరా తీయగా కలెక్టర్ కార్యాలయం నుంచి నివేదికలు తెప్పించుకొని చూశారు. బిజ్వారం గ్రామానికి చెందిన 50 పుస్తకాలు పంచకుండా పెండింగ్‌లో ఎందుకు పెట్టుకున్నారని అధికారులు వీఆర్‌వోలను ప్రశ్నించారు.
రైతుకు పాస్‌పుస్తకాలను నేరుగా అధికారులు, వీఆర్‌వోలు ఇవ్వాల్సిందిపోయి వారు గ్రామాల నుండి వచ్చినా పట్టించుకోకుండా కార్యాలయంకు రప్పించి ఒక్కోక్క పాస్‌పుస్తకానికి భారీ ఎత్తున ముడుపులు చెల్లిస్తేనే పాస్‌పుస్తకాలు ఇస్తామని అధికారులు చెబుతున్నారని, రైతులకు మాత్రం చెప్పులరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఏసీబీ అధికారుల ముందు వాపోయారు. అధికారులు రెండవ రోజు తనిఖీలు చేయడంతో కార్యాలయంలో సిబ్బంది అప్రమత్తమై రైతులకు కావాల్సిన పనిని చేయడం మొదలుపెట్టారు. తహశీల్దార్ కార్యాలయంలో గత కొనే్నళ్ల నుంచి లంచాలకు అధికారులు రుచిమరిగి పనిచేయకుండా తిప్పుకోవడంతో విసుగుచెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. ఏది ఏమైనప్పటికీ అధికారుల గుండెల్లో మాత్రం గుబులు అంటించేలా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.