క్రైమ్/లీగల్

రహదారి భద్రతపై అవగాహన పెరగాలి: పునేఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 15: రహదారి ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యంతో పాటు అధికారులు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలుగుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునేఠా అన్నారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్‌లో జరిగిన రహదారి భద్రత సదస్సుకు హాజరైన వివిధ శాఖల అధికారులను ఉద్దేశించి పునేఠా మాట్లాడుతూ తన అనుభవంతో విదేశాల్లో రహదారి భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో వివరించారు. 15 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి వాటర్ హార్వెస్టింగ్ పరిశీలనకు అధికారులతో వెళ్లామన్నారు. ఆ సందర్భంగా 72 సంవత్సరాల రిటైర్డ్ ఉద్యోగి రాత్రి సమయంలో కారు డ్రైవింగ్ చేస్తూ హోటల్‌కు మమ్మల్ని భోజనానికి తీసుకువెళ్లడమే కాకుండా 12.30 గంటలకు తిరిగి తమ హోటల్‌లో వదిలిపెట్టారన్నారు. ఈ సంఘటన ద్వారా ఆ ప్రాంతంలో రహదారి భద్రత ఏ విధంగా ఉందో మనకు ఒక మంచి సందేశం ఇచ్చారన్నారు. రోడ్డు భద్రతపై భారతదేశానికి ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తుందన్నారు. మన దేశంలో మానవ జీవితాల విలువ చాలా తక్కువగా ఉంటుందన్నారు. మన దేశంలో 10-15 సంవత్సరాల పిల్లలు కూడా నవ్వుతూ సరదాగా డ్రైవింగ్ చేస్తారని ఈ విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే బాధ్యతాయుతంగా కట్టడి చేయాలన్నారు. నార్వే, స్వీడన్ లాంటి దేశాల్లో రోడ్డు ప్రమాదాలు తక్కువ స్థాయిలో సంభవిస్తున్నాయని అందుకు వారు అవలంబిస్తున్న వేగ పరిమితి, ప్రతి 15 కిలోమీటర్లకు తనిఖీలు నిర్వహణ, సీట్‌బెల్ట్ ఉపయోగించడం, హెల్మెట్ వాడకం పెంచడంతో రోడ్డు ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 నివేదిక ప్రకారం తక్కువ ఆదాయం కల్గిన దేశాలలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్నారు. భారతదేశంలో కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారినపడి మరణిస్తున్నారన్నారు. రోడ్డు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి జిల్లా, ప్రతి పోలీసు స్టేషన్‌లో రోడ్డు ప్రమాదాలు, మరణాలపై పూర్వ డీజీపీ మాలకొండయ్య కాలంలో ప్రతి రోజు ఆరా తీసేవారన్నారు. అదే విధంగా రహదారులపై వెయ్యి బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారన్నారు. 2017వ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు 11.85 శాతం ఉండగా 2018వ సంవత్సరంలో 8.57 శాతానికి తగ్గించగలిగామన్నారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం రోడ్డు ప్రమాదాలపై తీసుకుంటున్న చర్యలను మార్చి 31 లోపు సుప్రీం కోర్టుకు నివేదిక అందివ్వాలన్నారు.