క్రైమ్/లీగల్

హైకోర్టు అడ్వకేట్ దారుణ హత్య కేసులో.. పది మందికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మార్చి 15: ఎనిమిదేళ్ళ క్రితం సంచలనం రేపిన హైకోర్టు అడ్వకేట్ హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు పడింది. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ (తహశీల్దార్) కార్యాలయం ముందే పట్టపగలు ప్రత్యర్థులు తల్వార్‌లతో న్యాయవాదిని నరికి చంపారు.
కోట్లాది రూపాయల విలువ చేసే భూ వివాదంలో ఈ దారుణ సంఘటన జరిగింది. అప్పట్లో ఈ హత్యోదంతం రాష్టవ్య్రాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాలలోకి వెళితే... రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, నానక్‌రామ్‌గూడ వద్ద గల రెండెకరాల భూ వివాదం కోర్టుల వరకు వెళ్ళింది. ఈదులపల్లి సంజీవ రెడ్డి తరపున బాగ్‌అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది శేరి అశోక్ రెడ్డి వాదించి కోర్టులో నెగ్గారు. సదరు భూమిని స్వాధీనం చేసుకోవడానికి రెవెన్యూ అధికారులతో మాట్లాడేందుకు 2011 మార్చి, 26వ తేదీన శేరిలింగంపల్లి మండల డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ కార్యాలయానికి తన మారుతి 800 కారులో ఉదయం 10.30 గంటలకే చేరుకున్నాడు. రూ.20 కోట్లకు పైగా విలువ చేసే అత్యంత విలువైన భూమిని తమకు దక్కకుండా అడ్వకేట్ చేశాడనే అక్కసుతో రగిలిపోయిన నానక్‌రాంగూడ వాస్తవ్యులు సూరారం ప్రతాప్ రెడ్డి, సూరారం దశరథ్ రెడ్డి కుటుంబాలకు చెందిన వ్యక్తులు బ్లాక్ స్కార్పియో కారులో వచ్చి అక్కడే కాపుకాశారు. అడ్వకేట్ కారులో నుంచి దిగి కార్యాలయంలోనికి నడుచుకుంటూ వెళుతుండగా కండ్లల్లో కారం కొట్టి తల్వార్‌లతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. దాదాపు 40 కత్తిపోట్లకు గురైన లాయర్ అశోక్ రెడ్డిని ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్ళగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.క్రైమ్ నెంబర్ 168/2011 ద్వారా భారత శిక్షాస్మృతి చట్టం 147, 148, 120 (బీ), 302 రెడ్‌విత్ 149 సెక్షన్‌లు, సెక్షన్ 27 (2) ఐఏ యాక్టు కింద అప్పటి చందానగర్ ఇన్స్‌పెక్టర్ సురేందర్ రావు.. కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి సైబరాబాద్ క్రైం ఏసీపీ ఎంఎస్ వేణుగోపాల్ రావు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ.రాములు కేసు వాదించారు. ఈ కేసులో వాదనలు విన్న ఎల్‌బీ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా కోర్టు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి బీ.సురేష్ నిందితులైన నానక్‌రాంగూడకు చెందిన సూరారం ప్రతాప్ రెడ్డి (55), సూరారం జగదీశ్వర్ రెడ్డి (26), సూరారం శేఖర్ రెడ్డి (29), టీ.వికాస్ సింగ్ (29), సూరారం దశరథ్ రెడ్డి (60), సూరారం శ్రీనివాస్ రెడ్డి (29), సూరారం అంజి రెడ్డి (45), సూరారం కృష్ణా రెడ్డి (40), వీ.కృష్ణ (38), సత్యనారాయణ గౌడ్ (50)లకు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు చందానగర్ ఇన్స్‌పెక్టర్ బీ.రవీందర్ తెలిపారు.