క్రైమ్/లీగల్

మాదాపూర్‌లో చైన్ స్నాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 16: ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గోలుసుతో పాటు మంళ సూత్రాలను లాక్కెళ్లిన సంఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కాలనీలో జరిగింది. పోలీసులు, బాధితురాలు కథనం ప్రకారం వివారలు ఇలా ఉన్నాయి. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీలో 1104 ప్లాటులో నివాసముంటున్న రమాదేవి (37) ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. మోటరు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తు కాలనీలో తిరుగుతూ ముందుకు వెళ్లారు. నిందితులను గమనించకుండా ముగ్గు వేసుకుని ఇంట్లోకి వెళ్తున్న రమాదేవిని మోటరు సైకిల్‌పై వచ్చిన ఇద్దరిలో ఒక వ్యక్తి వెంబడించాడు. ఇంట్లోకి వెళ్తున్న ఆమె వెనుకే వెంబడించి వెళ్తుండడంతో అనుమానం వచ్చి చూసే సరికి మెడలో ఉన్న పూస్తెల తాడును లాగడానికి ప్రయత్నించారు. బలవంతగా లాగడం ఇద్దరు పెనుగులాడుతుండగా రమాదేవి కేకలు వేసింది. కేకలు వేస్తు పూస్తెల తాడును గట్టిగా పట్టుకునినప్పటికీ స్నాచర్ గోలుసును వదలకుండా లాగడంతో రమాదేవి కింద పడిపోయింది. రమాదేవి కింద పడిపోవడంతో నిందితుడు బంగారు పూస్తేల తాడును లాక్కుని పారిపోయాడు. సంఘటనలో రమాదేవికి చేతులకు, కాళ్లకు దెబ్బలు తగిలాయి. రమాదేవి గచ్చిబౌలిలోని ఐటీ ఓకంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కుంటుంబ సభ్యులుబాసరలోని సరస్వతి దేవాలయానికి వెళ్లేందుకు తయారవుతున్న సమయంలో సంఘటన జరిగిందని తెలిపారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.