క్రైమ్/లీగల్

నక్సలైట్ పేరుతో వ్యక్తికి బెదిరింపు కాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 16: నక్సలైట్ అని పేరు చెప్పి వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నాచారం అన్నపూర్ణ కాలనీలో నివసించే బీ.కృష్ణ నాయక్ అలియాస్ కిట్టు(23) స్క్రాబ్ వ్యాపారీ. గతంలో పలు నేరాలు చేసి జైలుకి వెళ్లి వచ్చినట్టు సీపీ తెలిపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత స్క్రాబ్ వ్యాపారం చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశంతో మల్లాపూర్‌లో నివసించే దయాకర్ అనే వ్యక్తికి ఈనెల 10 వతేదిన ఫోన్ చేసి తను నక్సలైట్ సుధాకర్ అన్నని చెప్పి, తనకు రూ.20 లక్షలు ఇవ్వాలని లేకుంటే అతని కుటుంబసభ్యులను ప్రాణపాయం తలపెడతానని చెప్పి దయాకర్‌ను బెదిరించినట్టు సీపీ తెలిపారు. బాధితుడు నాచారం పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా అధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుక్నుట్టు సీపీ తెలిపారు.