క్రైమ్/లీగల్

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం చిత్రాలు విడుదలను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాలు విడుదల అయితే ఆంధ్రలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ చిత్రాలపై స్టే ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. చీఫ్ జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం సినిమాలు విడుదల చేస్తే గొడవలు, అల్లర్లు జరుగుతాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆంధ్ర ప్రజల అభిప్రాయాలను మీరు ఎలా నిర్ధారిస్తారని ఆయన తరఫు న్యాయవాదిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రజల ప్రాథమిక హక్కులపై ఏకవాక్యంతో ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. మీ వ్యక్తిగత అభిప్రాయాలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తారా? అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత పౌరులు వివేకవంతులు, ఈ సినిమాలతో ఆంధ్ర ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్న కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.