క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి 19: శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో మహిళను అత్యాచారంతో పాటు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గుర్తుతెలియని మహిళను కొందరు దుండగులు ఎక్కడినుంచో తెచ్చి శంషాబాద్ ప్రాంతమైన హైదరాబాద్ బెంగళూర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రైయివేటు వెంచర్‌లో అత్యాచారం జరిపి, హత్యచేసి పెట్రోలు పోసి తగలబెట్టిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివారాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో నాటుసారా విక్రేతలందరి బైండోవర్
కులకచర్ల, మార్చి 19; గతంలో నాటుసారా విక్రేతలందరినీ మంగళవారం బైండోవర్ చేశారు. కులకచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో సారా నిషేధం ఉన్న సమయంలో అక్రమంగా సారాను విక్రయించే వారు వారికి ప్రభుత్వం కొంతమందికి ఉపాధి నిమిత్తం రుణాలు ఇచ్చింది. వారితో మరికొందరికి ఇంకా రుణాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ఎలాంటి అలజడులు సృష్టించకుండా ఉండేందుకు దీనికి తోడు అనుమతులు లేకుండా నాటుసారా గానీ ఇతర గొలుసు మద్యం దుకాణాలు కానీ కొనసాగనివ్వకుండా ఉండేందుకు ముందస్తుగా వీరందరికి తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. తిరిగి వారందరితో సంతకాలు చేయించుకుని వదిలిపెట్టారు.