క్రైమ్/లీగల్

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిటైర్డు ఐఏఎస్ అధికారి చెందిన రూ.225 కోట్ల ఆస్తులను పన్ను ఎగవేత కేసులో ఆదాయంపన్ను (ఐటీ) శాఖ జప్తు చేసింది. ఈ మేరకు రిటైర్డు ఐఏఎస్ అధికారి ఎన్ రామ్‌కు ఐటీ అధికారులు నోటీసులను జారీ చే శారు. ఢిల్లీ, ముంబయి, నోయిడా, కోల్‌కొతాలో 20కుపైగా ఆస్తుల ను జప్తు చేశారు. లక్నోలోని ఆయన ఆఫీసు వద్ద మూడు లగ్జరీ కార్లను కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.64 కోట్ల నగదును, రూ.50లక్షల మాంటాబ్లాంక్ పెన్సులను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఈ రిటైర్డు అధికారికి చెందిన రూ.300 కో ట్ల ఆస్తులను వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు , వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. 1979 ఐఎఎస్ బ్యాచికి చెందిన ఈ ఈఅధికారి ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సీఎంగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేశారు. యూపీ ప్రభుత్వశాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.