క్రైమ్/లీగల్

గోద్రా అల్లర్ల కేసులో మరో నిందితుడికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: గోద్రా అల్లర్ల కేసులో ఒక నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. గోద్రా రైలుదహనం కేసు 2002లో జరిగిన విషయం విదితమే. ప్రత్యేక సిట్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌సీ వోహ్రా ఈ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో యాకుబ్ పటాలియాకు యావజ్జీవ ఖైదును విధించారు. ఈ నిందితుడిపై వచ్చిన అభియోగాలను ప్రాసిక్యూషన్ రుజువు చేసింది. పటాలియాను గత ఏడాది జనవరిలో పోలీసులు అరెస్టు చేశారు. గోద్రా రైలుపై దాడి దహనం కేసు జరిగి 16 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి ఈ నిందితుడి కోసం పోలీసులు వేటాడుతున్నారు. గోద్రా ఘటనలో 59 మంది కరసేవకులు సజీవంగా మరణించారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు కోచ్‌లు దహనమయ్యాయి. సబర్మతి జైలులో ఈ కేసు విచారణ జరిగింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇంత వ రకు ఈ కేసులో 31 మందికి కోర్టు శిక్ష విధించింది. 11 మందికి మరణ శిక్ష, 20 మం దికి జీవిత ఖైదు విధించారు. 2017లో గుజరాత్ హైకోర్టు 11 మం దికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. కాగా గతే డాది మరో ఇద్దరికి ఫరూక్ భానా, ఇమ్రాన్ షేరీకి ప్రత్యేక కోర్టు జీవి త ఖైదును విధించింది. మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చే సింది. కాగా ఈ కేసులో మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.