క్రైమ్/లీగల్

9మందికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధురై: తమిళనాడులోని దినకరన్ అనే తమిళ పత్రికపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను హత్య చేసిన కేసులో తొమ్మిది మందికి జీవిత ఖైదును విధిస్తూ మద్రాసు హైకోర్టు బెంచి తీర్పు వెలువరించింది. ఈ ఘటన 2007లో జరిగింది. ఆ ఏడాది మే 5వ తేదీన జరిగిన ఈ ఘటనలో గోపీనాథ్, వినూత్, ముథరమాలింగంలు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 2009 డిసెంబర్ 9వ తేదీన 17 మంది వ్యక్తులు నిర్దోషులంటూ కోర్టు వారిని విడుదల చేసింది. ఈ కేసును సీబీఐ కోర్టు తొలుత విచారించింది. ఈ కేసులో హతుడైన వినూత్ తల్లి మద్రాసు హైకోర్టులో ఆపీల్ చేశారు. జస్టిస్ పీఎన్ ప్రకాశ్, జస్టిస్ బీ పుగలేందీ విచారించారు. ఈ కేసులో పీ అటాక్, పీ విజయ్, కందస్వామి, తిరుముర్గన్, రుబాన్, మాలిక్ బచాలకు జీవిత ఖైదును విధించింది. పేలుడు పదార్థాల నిరోధక చట్టం, హత్య, ఆస్తి నష్టం కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విడుదలైన ఎనిమిది మందిని వెంటనే అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. పీ అటాక్ అనే వ్యక్తి ఇప్పటికే పలయంకొట్టాయ్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తుచేసిన డీఎస్‌పీ రాజారాం కూడా నిందితుడేనని, ఈ నెల 25వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి చెందిన అనుచరులు తమ నాయకుడికి కాకుండా స్టాలిన్‌కు అనుకూలంగా వార్తలు ప్రచురిస్తున్నారనే ఆవేశంతో పత్రికాఫీసుపై దాడి చేసి హత్యలకు పాల్పడ్డారు. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసి 2014లో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కాగా ఇందులో 11 మందిని వెంటనే అరెస్టు చేయాలని హైకోర్టు బెంచి ఆదేశించింది. నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఈ కేసులో మరో నిందితుడు దయాముత్తు పరారీలో ఉన్నాడు. మిగిలిన వారు కోర్టుకు హాజరై బెయిల్ పొందారు.