క్రైమ్/లీగల్

బాసర ఆలయం వద్ద సైకో వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, మార్చి 21: నిర్మల్ జిల్లా పరిధిలోని బాసర ఆలయం వద్ద గురువారం హోలీ పర్వదినం రోజున సైకో వీరంగం సృష్టించాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిజామాబాద్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్ అమ్మవారి దర్శనానికి గర్భాలయంలోకి వస్తుండగా గమనించిన హోంగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా వారిపై కత్తిచూపించి బెదిరించేందుకు ప్రయత్నం చేశాడు. వెనుక నుంచి భక్తుడు సైకో ప్రకాష్‌గౌడ్‌పై దాడి చేయడంతో హోంగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి ఒక కత్తి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో సైతం అమ్మవారి ఆలయంలోకి చొరబడి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడానికి ప్రయత్నించగా హోంగార్డ్స్, అర్చకుడు, ఆలయ సిబ్బంది అప్రమత్తమై అతనని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పూజారికి, ఆలయ సిబ్బందికి ఒకరికి గాయాలయ్యాయి. మరోమారు ఆలయంలోకి ప్రవేశించి ఏదో ఒక ప్రమాదం తెచ్చేలోపల అప్రమత్తమైన సిబ్బంది పట్టుకున్నారు.
ఆలయ భద్రతపై నీలినీడలు
ఓ భక్తుడు ఆలయంలోకి కత్తితో ప్రవేశించడం భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ సైతం అదే సైకో ఆలయంలోకి ప్రవేశించి అత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. సదరు సైకో వీరం గానికి ఆలయ అర్చకుడు, ఆలయ సిబ్బంది గాయాలపాలయ్యారు. అయినప్పటికీ ఆలయ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేయడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. సైకో ప్రకాష్‌గౌడ్ మూడోసారి ఆలయంలోకి మారణాయుధాలతో ప్రవేశించడం భద్రత డొల్లతనాన్ని తెలియజేస్తోంది. ప్రమాదం పెద్దస్థాయిలో జరిగితే తప్ప భద్రతను కట్టుదిట్టం చేయరేమోనని భక్తులు ఆరోపిస్తున్నారు.

చిత్రాలు.. పట్టుబడ్డ సైకో ప్రకాష్‌గౌడ్
* అతని వద్ద లభించిన కత్తి, సెల్‌ఫోన్