క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 21: ప్రేమించిన వాడితో పెళ్లి జరపకుండా మరో వ్యక్తితో పెళ్లి జరపడం పట్ల ఆ యువతి తిరిగి తమ గ్రామానికి వచ్చి ప్రియుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన నాగరాజు (30), రామేశ్వరి (23) అనే ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం మధ్యాహ్నం తమ ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఇద్దరు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వేర్వేరుగా గ్రామంలో వెతికారు. రామేశ్వరి తల్లిదండ్రులు ప్రతి ఇంటి వెళ్లి తమ కూతురు వచ్చిందా? అని వాకాబు చేశారు. ఇంతలో నాగరాజు కుటుంబ సభ్యులు కూడా తమ వాడు సైతం ఇంటికి రాలేకపోయాడని ఆందోళనకు గురయ్యారు. అయితే, గురువారం ఉదయం గ్రామ సమీపంలోని మొత్కులకుంట చెరువు వైపు గ్రామస్థులు వెళ్లి చూడగా అక్కడ ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. వారిని పరిశీలించగా వారి నోట్లో నుండి నురగులు వచ్చి ఉన్నాయి. వారి దగ్గర క్రిమి సంహరక మందు డబ్బా ఉంది. ఇద్దరు కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. కాగా, రామేశ్వరికి పది నెలల క్రితం కర్వేనా గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెళ్లి జరిగింది. కానీ పెళ్లి జరిగిన రెండు నెలలకే భార్య భర్తల మధ్య బేదాభిప్రాయాలు రావడంతో రామేశ్వరి తల్లిగారి గ్రామమైన అన్నసాగర్‌కు వచ్చింది. అయితే, రామేశ్వరి, నాగరాజు మధ్య ఉన్న ప్రేమను కాదని కులాలు వేర్వేరుగా కావడంతో యువతికి పెళ్లి జరిపించారు. గ్రామానికి రామేశ్వరి తిరిగి రావడంతో మళ్లీ వారి మధ్య యథావిధిగా ప్రేమ వ్యవహరం కొనసాగుతూనే ఉంది. కానీ తమ కుటుంబ సభ్యులు తమను వేరు చేస్తారనే భయంతో ఇద్దరు కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారని అన్నసాగర్ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జిల్లా అసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహలను ఆప్పగించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో అన్నసాగర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.