క్రైమ్/లీగల్

పుల్వామా సూత్రధారి సన్నిహితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గతనెలలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలో ప్రధాన సూత్రధారి ముదాసిర్ సన్నిహితుడు జైషే మహమ్మద్ టెర్రరిస్టు సజ్జద్ ఖాన్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పుల్వామాకు చెందిన 27 ఏళ్ల సజ్జద్ ఖాన్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో అరెస్టు చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. అరెస్టు చేసిన సజ్జద్ ఖాన్‌ను ఈనెల 29 వరకు ఎన్‌ఐఏ కస్టడీలో ఉంచేందుకు వీలుగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారం సాయంత్రం సూచించింది.