క్రైమ్/లీగల్

చెరువు ఊబిలో దిగబడి ఇద్దరు విద్యార్థుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగపాలెం, మార్చి 22: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కె గోకవరం పంచాయతీలోని గణపవారిగూడెం, కె గోకవరం గ్రామాలకు చెందిన ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..కె గోకవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో వీరిద్దరూ తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. పాఠశాలకు వేసవి కారణంగా ఒంటిపూట బడుల నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు గణపవారిగూడెం గ్రామంలోని జంగకుంట చెరువులో ఆరుగురు విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు పిట్టా రాముడు (16) చెరువులో ఉన్న ఊబిలో కూరుకుపోయాడు. వీరిలో ఒక విద్యార్థి గట్టుపైనే ఉండగా, మిగిలిన నలుగురు అతనిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ నలుగురు విద్యార్థులు కూడా ఊబిలో కూరుకుపోయారు. అటుగా వెళుతున్న స్థానికులు ముగ్గుర్ని రక్షించగా, మరో విద్యార్థి ఏసు కిరణ్ (15) కూడా ఊబిలో కూరుకుపోయి మృతిచెందాడు. దీంతో గణపవారిగూడెం, కె గోకవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో పిట్టా రాముడు కె గోకవరం గ్రామానికి చెందిన పిట్టా కొండయ్య, మరియమ్మల కుమారుడు. అలాగే ఏసు కిరణ్ గణపవారిగూడెంకు చెందిన పిట్టా జ్యోతి, ధనుంజయ్‌ల కుమారుడు. అయితే కిరణ్ తల్లి జ్యోతి తన భర్త నుంచి విడిపోయి తన కుమారుడితో గణపవారిగూడెంలో జీవనం సాగిస్తోంది. జ్యోతికి ఏసు కిరణ్ ఏకైక కుమారుడు మృతిచెందటంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఒకే సంఘటనలో ఇద్దరు వేర్వేరు గ్రామాలకు చెందిన విద్యార్థులు మృతిచెందటంతో గణపవారిగూడెం, కె గోకవరం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదుజేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.