క్రైమ్/లీగల్

జేకేఎల్‌ఎఫ్‌పై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌పై (జేకేఎల్‌ఎఫ్) నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. జేకేఎల్‌ఎల్‌కు యాసిన్‌మాలిక్ అధ్యక్షుడుగా ఉన్నాడు. రాష్ట్రంలో మిలిటెంట్లకు మద్దతు ఇస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే అభియోగంపై జేకేఎల్‌ఎఫ్‌ను కేంద్రం నిషేధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉత్తర్వులను జారీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షులుగా ఉన్న భద్రతా కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై కేంద్రహోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబా మాట్లాడుతూ, భారత భూభాగంలో వేర్పాటు వాద కార్యకలాపాలను అనుమతించే ప్రసక్తిలేదన్నారు. 1989లో కాశ్మీరీ పండిట్ల ఊచకోతకు పాల్పడినట్లు ఈ సంస్థపై అభియోగాలు ఉన్నాయి. ప్రస్తుతం యాసిన్ మాలిక్‌ను జమ్మూలోని కోట్ బల్వాలా జైలులో నిర్బంధించారు. మూడు దశాబ్థాల క్రితం అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి మఫ్తీ మహమ్మద్ సరుూద్ కుమార్తె రుబయా సరుూద్ కిడ్నాప్ కేసులో మాలిక్ ప్రధాన నిందితుడు.
జేకేఎల్‌ఎప్‌ను 1970లో అమానుల్లా ఖాన్ ఏర్పాటు చేశాడు. ఇంతవరకు రాష్ట్రంలోని వివిధ పోలీసు స్టేషన్లలో 33 కేసులు జేకేఎల్‌ఎఫ్ సంస్థపై నమోదై ఉన్నాయి. 1984లో ఇంగ్లాండ్‌లో ఉన్న భారత రాయబారి రవీంద్ర మాతే కిడ్నాప్ హత్య కేసులో కూడా జేకేఎల్‌ఎఫ్ పాత్ర ఉంది. ఈ కేసులో నిందితుడు మక్బూల్ భట్‌ను కాశ్మీర్ జైల్లో ఉరి తీశారు.