క్రైమ్/లీగల్

మత్తులో సవారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారి మద్యం సేవించి వాహనం నడిపి ఓ ప్రమాదానికి బాధ్యుడైనందున సస్పెన్షన్‌కు గురయ్యాడు. పూర్తి వివరాలకు వెళితే పాతబస్తీ కాలపత్తర్ పోలీసు స్టేషన్‌లో అదనపు ఇన్స్‌పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న బి.విక్రమ్ సింగ్ శనివారం ఉదయం తిరుమలగిరి ట్రాఫిక్ జంక్షన్ వద్ద యాక్సిడెంట్ చేశాడు. దీంతో విధి నిర్వహణలో మద్యం సేవించి వాహనం నడిపినందుకు గాను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని సీపీ తెలిపారు. బాధ్యత కలిగిన అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై ఉన్నతాధికారులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీసీ ఇన్స్‌పెక్టర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.