క్రైమ్/లీగల్

గృహిణి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, మార్చి 24: మనస్థాపానికి గురైన గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్ విజయపురికాలనీకి చెందిన కొమిరెల్లి ప్రశాంతి(24) భర్త రమేష్ రెడ్డితో కలిసి ఉంటుంది. శనివారం రాత్రి ప్రశాంతి ఇంట్లో ఉన్న సమయంలో పక్క పోర్షన్‌లో నివాసం ఉండే కుంచాల నరేష్(27) తలుపుతట్టి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఇంటి యజమానులకు చెప్పిన, ప్రశాంతి మనస్థాపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. గాయపడిన ప్రశాంతిని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ప్రశాంతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.