క్రైమ్/లీగల్

ములాయం, అఖిలేష్‌పై కేసు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగివున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్, అతని కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్‌లపై కేసు నమోదు విషయంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు సీబీఐపై తీవ్రంగా మండిపడింది. ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్‌తోపాటు అతని ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశారా? లేదా? ఒకవేళ చేసుంటే దర్యాప్తు ఎంతవరకు వచ్చిందన్న అంశంపై రెండు వారాల్లోగా తమకు సమగ్ర వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన డివిజన్ బెంచ్ ఈమేరకు సీబీఐకి జారీ చేసిన నోటీసుల్లో తీవ్రంగా హెచ్చరించింది. సమాజవాది పార్టీ అధికారంలో ఉన్నపుడు ములాయం సింగ్ యాదవ్, అతని కుమారుడు అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్, ములాయం సింగ్ మరో కుమారుడు ప్రతీక్ యాదవ్‌లు తమకున్న అధికారాలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడడంతోపాటు పరిమితికి మించి ఆదాయాలను కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథ్ చతుర్వేది 2005లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని సమగ్రంగా పరిశీలించిన అపెక్స్ కోర్టు ములాయం, అతని కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని 2007 మార్చి 1న అపెక్స్ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఫిర్యాదుదారు ఆరోపించినట్టుగా ములాయం సింగ్ యాదవ్, అతని కుటుంబీకులు ఆదాయానికి మించిన ఆస్తులు అక్రమంగా సంపాదించారా? లేదా? అన్న అంశంపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని సీబీఐని అపెక్స్ కోర్టు సూచించింది. ఇదే సందర్భంలో 2012లో ములాయం సింగ్ కుటుంబ సభ్యులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, దానిని కోర్టు కొట్టివేయడమే కాకుండా అక్రమ ఆస్తులపై తక్షణం దర్యాప్తు చేపట్టాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ములాయాం సింగ్, అతని కుటుంబ సభ్యుల పరిమితికి మించిన ఆస్తుల అంశం గత 11 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఈ అంశం మళ్లీ సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో అసలు దీనిపై కేసు నమోదు చేశారా? లేదా? ఒకవేళ కేసు నమోదు చేసి ఉంటే అది ఎంతవరకు వచ్చిందని సీబీఐని సూటిగా ప్రశ్నించింది.