క్రైమ్/లీగల్

నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌పై 29న లండన్ కోర్టు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 26: ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు, రెండు బిలియన్ డాలర్ల మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ భారత్‌కు తిరిగి వచ్చేందుకు సమర్పించిన రెండో బెయిన్ పిటిషన్‌పై లండన్ కోర్టు ఈనెల 29న విచారణ చేపట్టనుంది. నీరవ్ మోదీకి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై లండన్ వెస్ట్ మినిష్టర్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారంనాడు విచారణ చేపట్టనుంది. 48 ఏళ్ల నీరవ్ మోదీ సెంట్రల్ లండన్‌లోని ఒక బ్యాంకులో కొత్తగా ఖాతా ప్రారంభించేందుకు వెళ్లిన సమయంలో స్కాట్‌లాండ్ యార్డ్ అధికారులు అతనిని గత బుధవారం అదుపులోకి తీసుకుని సౌత్‌వెస్ట్ లండన్‌లోని హెచ్‌ఎమ్‌పీ వాండ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా నీరవ్ మోదీ తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై డిస్ట్రిక్ట్ జడ్జి మేరీ మలోన్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘బెయిల్ కోసం మరోసారి ఈనెల 29న కోర్టు ముందు నీరవ్ మోదీని ప్రవేశపెట్టవచ్చు’ అని ఒక కోర్టుకు చెందిన అధికార వర్గాలు మంగళవారం ధృవీకరించాయి. ఇదిలావుండగా, నీరవ్ మోదీ బెయిల్ అభ్యర్థనపై క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (ఎస్‌పీఎస్) బారిస్టర్ జొనాథన్ స్వెయిన్ భారత్ తరఫున వాదిస్తూ అభ్యంతరం లేవనెత్తుతున్న విషయం తెలిసిందే.