క్రైమ్/లీగల్

నిజామాబాద్ ఎన్నికపై స్టేకు హైకోర్టు నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిజామాబాద్ ఎన్నికపై స్టే విధించేందుకు రాష్ట్ర హైకోర్టు సోమవారం నాతడు నిరాకరించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్ధులున్నారని, అందులో స్వతంత్ర అభ్యర్ధులకు ఇంత వరకూ గుర్తులు కేటాయించలేదని, వారు ప్రచారం చేసుకునేందుకు సరిపడా సమయం లేదు కనుక ఎన్నికలను రెండో దశలో ఏప్రిల్ 18న నిర్వహించాలని కోరుతూ పోటీలో ఉన్న 16 మంది రైతుల తరఫున న్యాయవాది రచనారెడ్డి హైకోర్టులో తమ వాదనలను వినిపించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ రాజేశ్వర్‌రెడ్డిలతో కూడిన బెంచ్ ఈ దశలో ఎన్నికల వాయిదా లేదా ఎన్నికల తేదీ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 226 ప్రకారం ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత తాము జోక్యం చేసుకోలేమని పేర్కొన్న బెంచ్ ఈ సందర్భంగా పోన్నుస్వామి కేసును ప్రస్తావించింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేయమని కోరుతూ పిటీషనర్లు ఎన్నికలు పూర్తయిన తర్వాత జరిగిన అక్రమాలు, లోపాలను ఎత్తిచూపుతూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100(4) కింద పిటీషన్ దాఖలు చేయవచ్చని బెంచ్ సూచించింది. ఎన్నికల నిబంధనలు రూల్ 10(4), 10(6) కింద పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎన్నికల అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అభ్యర్ధులకు ఈవీఎంలను వినియోగించడం వల్ల నష్టం జరుగుతుందని, ఈవీఎంల స్థానే బ్యాలట్‌లు వాడాలని, అలాగే ప్రచారానికి సరిపడా సమయం ఇవ్వాలని పిటీషనర్ల తరఫున రచనారెడ్డి తమ వాదనలు వినిపించారు. రెండు రోజుల వ్యవధిలో 25వేల ఈవీఎంలను సమకూర్చుకున్న ఎన్నికల కమిషన్ ఇంత వరకూ ఎన్నికల చిహ్నాలను మాత్రం ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. అయితే తాజా పరిణామాలపై డిప్యుటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా ఎన్నికల సీఈఓ రజత్‌కుమార్‌తో చర్చించి నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికను ఈవీఎంలతోనే నిర్వహించాలని నిర్ణయించారు.
11న హైకోర్టుకు సెలవు
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 11న హైకోర్టుకు సెలవును ప్రకటించారు. అందుకు బదులు సెప్టెంబర్ 7న వచ్చే రెండో శనివారం నాడు హైకోర్టు పనిచేస్తుందని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలవు తెలంగాణ రాష్ట్ర జ్యుడిషిల్ అకాడమికి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి , సబార్డినేట్ కోర్టులకు సైతం వర్తిస్తుందని పేర్కొన్నారు.