క్రైమ్/లీగల్

ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 8: లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ గగన్‌పహాడ్ శానిటేషన్ అధికారి పట్టుబడ్డ సంఘటన రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ జీహెచ్ ఎంసీ సర్కిల్ కార్యాలయం పరిధిలో పని చేస్తున్న గగన్‌పహాడ్ శానిటేషన్ ఇన్‌చార్జ్‌గా జగదీష్ పని చేస్తున్నాడు. కాగా స్థానికంగా నైజర్ ఫంక్షన్‌హాల్‌కు సంబంధించిన ట్రేడ్ రెన్యూవల్‌ను ఫంక్షన్‌హాల్ యజమాని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో చెల్లించాడు. దీంతో జగదీష్ స్థానిక కార్యాలయంలో రెన్యూవల్ చేయకుండా ప్రధాన కార్యాలయంలో చేయించడమేంటని ప్రశ్నించాడు. స్థానికంగా ఫంక్షన్‌హాల్ సక్రమంగా నడువాలంటే తమకు లంచం ఇవ్వాలని జగదీష్ యజమానులను డిమాండ్ చేశాడు. దీంతో ఈ నెల 2వ తేదీన ఫంక్షన్‌హాల్ యజమానులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రూ.9 వేలను జగదీష్ ఫంక్షన్‌హాల్ యజమానుల వద్ద నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.