క్రైమ్/లీగల్

ఒకటి కాదు.. ఐదు లెక్కించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఓటర్లలో మరింత నమ్మకాన్ని కలుగజేయడానికి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కిస్తున్న ఒక వీవీ ప్యాట్‌కు బదులుగా ఐదు వీవీ ప్యాట్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. మొత్తం 50 శాతం వీవీ ప్యాట్లలోని ఓట్లను లెక్కించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా, 21 పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని దీపక్ గుప్తా, సంజయ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం దానిని తిరస్కరిస్తూ 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించడం అంటే పెద్దయెత్తున సిబ్బంది అవసరమని, ప్రస్తుతం మనకున్న ఇబ్బందుల దృష్ట్యా అది సాధ్యం కాదు కనుక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని తీర్పునిచ్చింది. అలాగే పార్లమెంట్ ఎన్నికలకు 35 వీవీ ప్యాట్లను లెక్కించాలని పేర్కొంది.
ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లపై పలు పార్టీలు సందేహాలు వ్యక్తం చేయడంతో ఓటు వేసిన గుర్తుగా ఓటరు గుర్తించడానికి ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్‌లను సైతం ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఏ గుర్తుకు ఓటు వేశాడో కొన్ని సెకన్ల పాటు స్లిప్‌లో కన్పిస్తుంది. తర్వాత ఆ స్లిప్ కట్ అయ్యి మిషన్లో భద్రంగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను సైతం ఏర్పాటు చేశారు. ఓటింగ్‌లో పారదర్శకత కోసం ప్రతి అసెంబ్లీ పరిధిలో ఒక వీవీ ప్యాట్‌లోని స్లిప్పులను దానికి అనుబంధంగా ఉన్న ఈవీఎంలో పోలైన ఓట్లను సరిచూసేవారు. రెండూ సరిపోతే అంతా సవ్యంగానే జరిగినట్టు భావించారు. అయితే దీనిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా, 21 విపక్ష పార్టీలు సుప్రీంలో సవాల్ చేశాయి. మొత్తం ఉన్న వాటిలో 50 శాతం వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కవేయాలని ఈసీని ఆదేశించాల్సిందిగా కోరాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించడమంటే చాలా సమయం పడుతుందని, ఒక్కో స్థానం ఫలితానికి ఐదారు రోజుల సమయం పడుతుందని, పైగా దీనికి పెద్దయెత్తున సిబ్బంది సైతం అవసరమని కోర్టుకు తెలియజేసింది. ఫలితానికి ఐదారు రోజులు పట్టినా ఫర్వాలేదని, అయితే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయనడానికి రుజువుగానే తాము 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని కోరుతున్నట్టు విపక్షాలు పేర్కొన్నాయి. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు 50 శాతం వీవీప్యాట్లను లెక్కించడం మనుకున్న వనరుల దృష్ట్యా సాధ్యం కాదు కాబట్టి ఒక్కో అసెంబ్లీకి ఐదు వీవీ ప్యాట్లను లెక్కించాలని సోమవారం తీర్పు చెప్పింది.