క్రైమ్/లీగల్

సజ్జనే సూత్రధారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: మాజీ ప్రధాని ఇందిర హత్యానంతరం 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సూత్రధారి, కాంగ్రెస్ మాజీ నాయకుడు సజ్జన్ కుమారేనని సీబీఐ సోమవారం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. వందలాది మంది నరమేధానికి దారితీసిన ఆ ఊచకోత ఘటనకు కింగ్‌పిన్‌గా ఉన్న సజ్జన్‌కుమార్‌కు బెయిలు ఇవ్వడానికి వీలులేదని సుప్రీంకు నివేదించింది. ఈ అల్లర్ల కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 17న సజ్జన్‌కుమార్‌కు మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేసిన సజ్జన్‌కుమార్ తనకు బెయిలు మంజూరు చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. ఆయన వాదనను సీబీఐ తరపున వాదించిన సొలిసితర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం జరిగిన విచారణలో వ్యతిరేకించారు. పాటియాల హౌజ్ జిల్లా కోర్టులో ఇదే ఘటనకు సంబంధించి మరో కేసులో సజ్జన్‌కుమార్ విచారణను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో ఆయనకు బెయిలు మంజూరు చేయాలంటే న్యాయ వక్రీకరణే అవుతుందని తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు నివేదించారు. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరిగిన మరుక్షణమే సిక్కు వ్యతిరేక అల్లర్లు మొదలయ్యాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఓ కేసులో సజ్జన్‌కుమార్‌ను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.