క్రైమ్/లీగల్

ఆలయ వ్యవహారాల్లో.. మీ జోక్యం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో ఆలయాలు, మత సంబంధ ప్రదేశాల్లో సౌకర్యాల లేమిపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వ అధికారుల పెత్తనమేనిటని కోర్టు నిలదీసింది. పూరీలోని జగన్నాథ్ ఆలయంలో భక్తులపై జరుగుతున్న వేధింపులపై న్యాయస్థానం తీవ్రంగానే స్పందించింది. జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం పూరీ జగన్నాథ్ ఆలయంలో భక్తులపై వేధింపులు, అధికారుల దోపిడీపై దాఖలైన పిటిషన్‌ను విచారించింది. ‘ప్రభుత్వ అధికారులకు ఆలయాల్లో పనేమిటీ? మీ పెత్తనం ఏమిటీ?’అని బెంచ్ నిలదీసింది. తమిళనాడులోని ఓ ఆలయంలో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. అది భక్తుల మతవిశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం. పైగా వాటి విలువ అమూల్యం అని కోర్టు వ్యాఖ్యానించింది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ట్రావెన్‌కోర్ దేవోస్వాం బోర్డు (టీడీబీ) నిర్వహణలో పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వమై బోర్డును ఏర్పాటు చేస్తుందని, ఇలాంటివి దేశ వ్యాప్తంగా అనేక ఆలయంలో నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. లౌకిక రాజ్యంలో ఆలయాల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం అనివార్యమని వేణుగోపాల్ బెంచ్‌కు తెలిపారు. కేసులో కోర్టు మధ్యవర్తిగా నియమితులైన సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ దీనిపై సవివరమైన నివేదిక అందజేసినట్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాను ఆలయాన్ని సందర్శించి నివేదిక రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. ‘ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా భక్తులను వేధింపులకు గురవుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పూజారి అనేక ఆంక్షలు పెడుతున్నాడు. ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా భక్తులు వౌనంగానే భరిస్తున్నారు. భక్తులో అత్యధికులు పేదలు, నిరక్షరాస్యులు కావడమే ఇందుకు కారణం’అని పిటిషనర్ తరఫున్యాయవాది బెంచ్‌కు తెలిపారు. తదుపరి విచారణ వచ్చేనెలలో చేపడతామని బెంచ్ పేర్కొంది. కాగా విచారణ సందర్భంగా ఓ న్యాయవాది జోక్యం చేసుకుని పిటిషన్‌కు విచారణ అర్హత లేదని గట్టిగా అనడంతో న్యాయమూర్తి బాబ్డే తీవ్రంగా స్పందించారు. ‘ఇక సరిపెట్టండి. కోర్టులో ఇలాగేనా ప్రవర్తించేది? బిగ్గరగా మాట్లాడితే సహించబోం. న్యాయస్థానాన్ని ఉద్దేశించి మాట్లాడే పద్ధతి ఇదికాదు’అని బాబ్డే మందలించారు. తొలుత కోర్టు మధ్యవర్తి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఆలయాల్లో ‘క్యూ’ విధానం లేకపోవడం, ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు క్రమబద్ధం చేయడానికి అవసరమైన యంత్రాంగం లేకపోవడం వంటి సమస్యలున్నాయని స్పష్టం చేశారు. ఒడిశా ప్రభుత్వం తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది ‘క్యూ విధానం పక్కాగా ఏర్పాటు చేయడం అన్నది అంత సులభం కాదు. ఆలయాన్ని మలిచిన తీరే అందుకు నిదర్శనం. పూరీ జిల్లా జడ్జి తన నివేదికలో ఈ విషయాలన్నీ కోర్టుకు తెలిపారు’అని గుర్తుచేశారు. ప్రతి భక్తుడికి ఆలయ ప్రవేశం కల్పించాలని పూరీ జగన్నాథ్ ఆలయ అధికారులను గత ఏడాది జూలైలో సుప్రీం కోర్టు ఆదేశించింది. భక్తులందరికీ పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించింది.