క్రైమ్/లీగల్

రూ. 8కోట్ల నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. సోమవారం నాడు హైదరాబాద్ నారాయణగూడ టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీలో 8 కోట్ల రూపాయల నగదు దొరికింది. పట్టుబడిన నగదు భారతీయ జనతా పార్టీకి చెందిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ జారీ చేసిన సెల్ఫ్ చెక్ ద్వారా బ్యాంక్ లో డ్రా చేశారన్నారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈకేసులో బ్యాంక్ మేనేజర్‌ను సైతం ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. పట్టుబడిన నగదుపై నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోవడం నగర పోలీస్ చరిత్రలో ఇదేనన్నారు. స్వాధీనం చేసుకున్న నగదుపై ఆదాయపు పన్ను అధికారులకు సమాచారం అందించామన్నారు. గత వారం వరుసగా సెలవులు రావడంతో సోమవారం భారీగా నగదును డ్రా చేశారన్నారు. నారాయణగూడ ఇండియన్ బ్యాంక్ నుంచి హిమయత్‌నగర్ వైపు వెళ్తున్న ఓ వెర్నా కారు ( ఏపీ 10 బీఈ 1234)లో భారీగా నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన నిందితుల్లో తోతిరెడ్డి ప్రదీప్‌రెడ్డితో పాటు కారు డ్రైవర్ గుండు శంకర్‌ను అదులోకి ప్రశ్నించడంతో తనకు నందిరాజు గోపీ అనే వ్యక్తి అప్పగించినట్లు విచారణ తేలిందన్నారు. పట్టుబడిన వ్యక్తు ల్లో నందిరాజు గోపీ, చలపతిరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నట్లు బయటపడింది.