క్రైమ్/లీగల్

టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ విలీనంపై హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: టీఆర్‌ఎస్ శాసనమండలి పక్షంలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్సీలకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. విలీనంపై వివరణ ఇవ్వాలని ఆకుల లలిత, కే దామోదర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకరరావు, టీ సంతోష్‌కుమార్‌లకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు మహ్మద్ అలి షబ్బీర్‌కు కూడా వివరణ కోరింది. శాసనమండలి చైర్మన్‌కు, మండలి కార్యదర్శికి, రాష్ట్రప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి,
న్యాయశాఖ కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని గతంలో కాంగ్రెస్‌కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి అప్పటి చైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ రాయగా ఆయన దానిని ఆమోదించారు. విలీనాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు గినె్న మల్లేశ్వరరావు, సీ బాలాజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ మండలి జారీ చేసిన బులిటిన్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటీషనర్లు కోరారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్సీలపై ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.