క్రైమ్/లీగల్

ఈసీ నోటీసుకు కేసీఆర్ వివరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిసుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామరాజు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 12న సాయంత్రం 5 గంటల లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గడువులోగా ముఖ్యమంత్రి తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అదనపు ముఖ్య అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్‌ను కలిసి వివరణ పత్రాన్ని అందజేశారు.