క్రైమ్/లీగల్

దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: అయోధ్య ప్రాంతంలోని ఆలయాల్లో పూజలు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన ఒక పిటిషన్‌ను కొట్టి వేసిన సుప్రీంకోర్టు 3ఈ దేశాన్ని మనశ్శాంతిగా ఉండనీయరా?2 అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిం ది. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రి మసీదు వివాదస్పద స్థలానికి ఆనుకుని ఉన్న వివాద రహిత ప్రాంతంలోని తొమ్మిది ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఈ పిటీషన్ దాఖలైంది. 3అయోధ్య విషయంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతునే ఉంటుంది..2 అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయ్, న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదరహిత ప్రాంతంలోని తొమ్మిది ఆలయాల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ దాఖలైన పిటీషన్‌ను జనవరి 10న అలహాబాద్
హైకోర్టు కొట్టి వేసింది. దానిపై పిటీషనర్‌దారు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంతో సర్వమత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా సదరు పిటీషనర్‌పై అలహాబాద్ హైకోర్టు రూ.5 లక్షల వ్యయభారాన్ని కూడా విధించింది. అయోధ్య విషయంలో 3ఏదో ఒకటి కెలికె2 ధోరణి విడనాడాలని పిటీషనర్‌దారు పండిత్ అమర్‌నాథ్ మిశ్రాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాదస్పద స్థలానికి దూరంగా ఉన్నప్పటికీ అయోధ్యలోని ప్రాచీన ఆలయాల్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించే విషయంలో అధికారులు సహకరించడం లేదంటూ పిటీషనర్‌దారు అప్పట్లో హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా అయోధ్య అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ఇటీవల మాజీ న్యాయమూర్తి ఖలీఫ్‌ఉల్లా సారథ్యంలో ఒక ప్యానెల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో అథ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు.