క్రైమ్/లీగల్

రహదారులు రక్తసిక్తం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లచెరువు/నందవరం, ఏప్రిల్ 12: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం చెందారు. మరో 16మందికి గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంలో కంటైనర్‌ను మినీబస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరో 14మంది ప్రయాణికులు గాయపడ్డారు. కర్నూలు జిల్లా హాలహర్వి వద్ద ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం యర్రగుంటపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఎదురుగా వస్తున్న లారీని ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు ఢీకొంది. దీంతో తనకల్లుకు చెందిన మహబూబ్‌బాషా (50), ఖాదర్‌బాషా (45), నగేష్ (30), భారతమ్మ (50), నంబులపూలకుంటకు మండలం యాదలవాండ్లపల్లికి చెందిన పీ.జయమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జయమ్మ భర్త రామచంద్రారెడ్డి(60), మరో గుర్తుతెలియని వ్యకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మినీబస్సులో ఉన్న మరో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరంతా కొక్కొంటి క్రాస్ నుంచి కదిరికి మినీబస్సులో వెళ్తుండగా ప్రమాదం బారినపడ్డారు. మృతుల రోదనలతో కదిరి ఆసుపత్రి దద్దరిల్లింది.
మరో సంఘటనలో కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని హాలహర్వి సమీపంలో రోడ్డువారగా నిలిపిన ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన మహబూబ్ బాషా(37), అయాన్(1) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఖాజా(34) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.