క్రైమ్/లీగల్

నాకు ఓటు వేయకపోతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూపీ/సుల్తాన్‌పూర్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: తనకు ఓటు వేయకపోతే ముస్లింల అభ్యర్థనలకు స్పందించే అవకాశం ఉండదంటూ కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సుల్తాన్‌పూర్ మెజిస్ట్రేట్ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ‘నాకే ఓటు వేయండి, లేదా..’ అంటూ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యల కెమెరాల దృశ్యాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ‘ఇప్పటికే నేను ఎన్నికల్లో నెగ్గేశాను, నిర్ణయం తీసుకోవాల్సింది మీరే’ అంటూ గురువారం ఇక్కడ జరిగిన ఒక సభలో వ్యాఖ్యానించినట్లు కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకున్న దరిమిలా షోకాజ్ నోటీసు కూడా ఆమెకు జారీ చేసినట్లు అదనపు ఎన్నికల కమిషనర్ బీఆర్ తివారీ చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని మేనకా గాంధీ ఇచ్చిన వివరణలో ‘నేను ముస్లింలను ప్రేమిస్తాను, బీజేపీ మైనారిటీ విభాగం సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాను..’ అని తెలిపారు. కాగా సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాస్తవంగా మేనకా గాంధీ అన్నదేమిటీ అంటే ‘నేనే గెలుస్తున్నాను, ప్రజల ప్రేమ, మద్దతే ఇందుకు కారణం, అయితే ముస్లింల మద్దతు లేకుండా నా విజయం అంత బాగుండదు, నేను నెగ్గిన తర్వాత ఎవరైనా ముస్లిం నా వద్దకు వస్తే నేను పట్టించుకోకపోవచ్చు, ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఆనందం ఉంటుంది..’ అని మేనకా గాంధీ అన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి.