క్రైమ్/లీగల్

15లోగా కోర్టులో లొంగిపోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: అల్లర్లు, హింసను ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ మాజీ మంత్రి యోగేంద్ర సావూ ఈనెల 15లోగా కోర్టు ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎఏ బోడ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిందితుడు సావూ సోమవారం లోగా న్యాయస్థానం ముందు లొంగిపోవాలని ఆదేశించింది. జార్ఖండ్ ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ తపేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ యోగేంద్ర సావూ రాంచీలోని సంబంధిత ట్రయల్ కోర్టు ముందు లొంగిపోతారని అంటూ ఈ కేసుకు సంబంధించిన రికార్డులను సుప్రీం కోర్టు అనుమతితో రాంచి కోర్టుకు బదిలీ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సావూ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను
ఈనెల నాలుగున సుప్రీం తిరస్కరించింది. ఇప్పటికే ఆయన బెయిల్‌కు సంబంధించిన పలు నిబంధనలు ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. అనంతరం తాను ఏ కోర్టులో లొంగిపోవాలనే విషయంపై స్పష్టత ఇవ్వాలని సావూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం శుక్రవారం స్పష్టత ఇచ్చింది. సోమవారం లోగా ఆయన కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కాగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో యోగేంద్ర సావూ హేమంత్ సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2013లో ఆయన అల్లర్లకు పాల్పడ్డారని, హింసను ప్రోత్సహించారన్న ఆరోపణలపై డజన్‌కు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా 2017, డిసెంబర్ 15న సావూ, అతని భార్యకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారిద్దరూ భోపాల్‌లోనే నివసించాలని, కోర్టుకు హాజరయ్యేందుకు మాత్రమే జార్ఖండ్‌కు రావాలని, అదీ కూడా భోపాల్ ఎస్పీకి సమాచారం అందించి, పోలీసుల రక్షణలో మాత్రమే రావాలని షరతులు విధించింది. కాగా, యోగేంద్ర సావూ, అతని భార్య నిర్మలాదేవి బెయిల్‌ను రద్దు చేయాలంటూ బీజేపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను ఇద్దరూ ఉల్లంఘించారని పేర్కొంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రముఖులమైన తాము కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, కాబట్టి ప్రచారం బెయిల్‌ను పొడిగించి అనుమతి ఇవ్వాలని వారు కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం ‘కోర్టు మీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడంలో విఫలయ్యారు.. మీ ప్రవర్తనతో కోర్టును అసంతృప్తికి గురి చేశారు.. ఇక ఎలాంటి దయకు మీరు అనర్హులు’ అని పేర్కొంది.