క్రైమ్/లీగల్

ఆ ముగ్గురి పోటీపై అప్పీలును విచారించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన రాజకీయ నాయకులు ఫారూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఇసిని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఫారూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ దేశ ద్రోహ ప్రకటనలు చేశారని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందున వారు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని, ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటీషన్ దాఖలైంది. హైకోర్టు జస్టిస్ ఎస్. రవీంద్ర భట్, జస్టిస్ ప్రతీక్ జలన్‌తో కూడిన డివిజన్ బెంచ్ పిటీషనర్ వినతిని పరిశీలించి, సరైన ఫోరంలో వినతిని దాఖలు చేసుకోవాలని సూచించింది. దీంతో పిటీషన్‌ను వెనక్కి తీసుకోవాలని, కొట్టి వేస్తున్నట్లు తెలిపింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడమే కాకుండా రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన ఆ ముగ్గురూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు లేదా ఎన్నికల సంఘం నిషేధం విధించాలని పిటీషనర్ తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ వాదన వినిపించారు. అంతేకాకుండా వారిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాల్సిందిగా కోరారు.