క్రైమ్/లీగల్

ఉచిత విద్యుత్తు, రుణాల రద్దు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: రాజకీయ నాయకులు ప్రజాకర్షక పథకాలకు మించి ఆలోచించవలసిన అవసరం ఉందని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఉచిత విద్యుత్తు, రుణాల రద్దు వంటి పథకాలు దీర్ఘకాలిక పరిష్కారాలు కావని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద పెద్ద హామీలు గుప్పిస్తున్న తరుణంలో ఉప రాష్టప్రతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ జరిగిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) 125వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఉచిత విద్యుత్తు, రుణాల రద్దు వంటివి దీర్ఘకాలంలో రైతులకు ఉపయోగపడబోవని అన్నారు. రైతులకు మరిన్ని వౌలిక సౌకర్యాలను కల్పించాలని, మెరుగయిన మార్కెట్ అవకాశాలు కల్పించాలని, సకాలంలో భరించగలిగిన రీతిలో, చౌకగా రుణాలు అందజేయాలని ఆయన సూచించారు. రైతుల సమస్యలకు ఇవే దీర్ఘకాలిక పరిష్కారాలని ఆయన అన్నారు. దేశంలోని విధాన నిర్ణయాలు తీసుకునే వారు ఈ మార్గంలో ఆలోచించాలని ఆయన హితవు పలికారు. బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) పెరుగుతుండటాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది తీవ్రంగా ఆందోళనపరుస్తున్న సమస్య అని అన్నారు. నిరర్ధక ఆస్తులు పెరుగుతుండటం వల్ల బ్యాంకుల రుణాలు ఇచ్చే సామర్థ్యం దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు.