క్రైమ్/లీగల్

‘పోలవరం’లో రెండు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలవరం ఎస్సై సిహెచ్ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం స్పిల్‌వేలో సెంటరింగ్ పనులు చేయడానికి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భీమలేస్ కుమార్‌రామ్ (22) 32వ బ్లాకు వద్ద ఉండగా ఇనుప నిచ్చెన తీసుకెళుతున్న ట్రాలీపై నుండి పడడంతో తలకు బలమైన గాయమైంది. అతనిని పోలవరం పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారి జి సుధాకర్ ధ్రువీకరించారని ఎస్సై చెప్పారు. అలాగే మరో సంఘటనలో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సతీష్‌కుమార్ 15వ బ్లాక్‌పై ఉండగా అదుపుతప్పి కిందకు
పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనికి పోలవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామచంద్రరావు తెలిపారు. కాగా ఇద్దరు యువకులు ఒకే రోజు ప్రమాదానికి గురి కావడంతో స్పిల్‌వేలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనబాట పట్టారు. సంఘటనా స్థలంలో కారు అద్దాలు పగులగొట్టారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రామచంద్రరావు ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీ నవయుగ ప్రతినిధి క్రాంతితో మాట్లాడి మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు అతని మృతదేహాన్ని జార్ఖండ్ రాష్ట్రానికి పంపిస్తామని హామీయిచ్చారు. అలాగే ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.

చిత్రం... పోలవరం స్పిల్‌వేలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన జార్ఖండ్ వాసి కుమార్‌రామ్