క్రైమ్/లీగల్

నాయకుని తండాలో భగ్గుమన్న ఎన్నికల కక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఏప్రిల్ 15: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకునితండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, నాటు బాంబులు రువ్వుకోవడంతో గ్రామంలోని 30 గృహాలు ధ్వంసమైనాయి. గ్రామస్థుల, పోలీసుల కథనం ప్రకారం గత సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మేరావత్ కొండానాయక్ గెలుపొందారు. అయితే, సర్పంచ్‌గా గెలుపొందిన మేరావత్ కొండానాయక్ ఓడిపోయిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి మేరావత్ సకృనాయక్‌ను ఒక ఫంక్షన్‌లో మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయిన వారు గెలుపొందిన వారి క్రింద పని చేయాలని చులకనగా మాట్లాడడంతో ఓడి పోయిన అభ్యర్థి తన ఇంటికి వచ్చి కుమారుడు మంగ్తాకు చెప్పారు. దాంతో మంగ్తా ఆగ్రహంతో సర్పంచ్ ఇంటికి వెళ్లి ఓడిపోయిన వారు నీ కింద పని చేయాలా? అంటూ నిలదీయడంతోమాటామాటా పెరిగి ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీసింది. దాంతో ఇరు పార్టీలకు చెందిన వారు గుమికూడడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నాటు బాంబులు, రాళ్లు విసురుకున్నారు. ఈ దాడులలో గ్రామంలో 30 గృహాలు ధ్వంసం కావడమే కాకుండ కృష్ణ పట్టీలో నాటుబాంబుల దాడి మరో సారి అలజడి సృష్టించింది. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ఉదయం గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడ్డ మూడావత్ గత్లీ, మేరావత్ సోమ్లా, మేరావత్ సాలిలను సాగర్‌లోని కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. సాగర్ సీఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగర్ ఎస్‌ఐ శీనయ్యతో కలిసి భద్రత చర్యలు చేపట్టారు. తిరుమలగిరి ఎస్‌ఐ కుర్మయ్య మాట్లాడుతూ ఘర్షణలకు కారణమైన ఇరువర్గాల వారిని ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కొంతమంది పరారీలో ఉన్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.