క్రైమ్/లీగల్

మీ స్పందన ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. పుణేకు చెందిన దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కాగా దీనిపై స్పందించాలని, జవాబు ఇవ్వాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌పైనా విచారణ చేపడుతున్నట్లు సుప్రీం కోర్టు బెంచ్ పిటిషనర్ల తరఫు న్యాయవాదికి తెలిపింది. శబరిమల ఆలయంలోకి వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు గత ఏడాది సెప్టెంబర్ 28న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మహిళలు నమాజు చేసుకోవడానికి వీలుగా మసీదులోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారా? నమాజు చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఎక్కడెక్కడ మహిళలకు అనుమతి ఉంది?, విదేశాల్లో అనుమతి ఉందా? అని బెంచ్ పిటిషనర్ల తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకు న్యాయవాది స్పందిస్తూ ముంబాయ్‌లోని హాజీ అలీ దర్గాలో మహిళల ప్రవేశానికి అనుమతి ఉందన్నారు. మసీదుల్లో ముస్లిం మహిళల ప్రవేశానికి అనుమతినిచ్చే పిటిషన్‌ను కేరళ హైకోర్టు లోగడ తోసిపుచ్చిందని ఆయన తెలిపారు. మక్కాలో, కెనడాలోని మసీదుల్లో అనుమతి ఉన్నట్లు చెప్పారు. ప్రార్థన కోసం మసీదులోకి వెళ్ళే ముస్లిం మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం కనిపించలేదని ఆయన తెలిపారు. మహిళలు మసీదుల్లో నమాజు చేయరాదని ఖురాన్‌లో లేదని, ప్రాఫిట్ మహ్మద్‌గానీ చెప్పలేదని న్యాయవాది వివరించారు. మసీదుల్లో నమాజు చేసుకోవడానికి మహిళలకు, పురుషులకు విడిగా ఎన్‌క్లోజర్లు ఉన్నాయని ఆయన తెలిపారు.