క్రైమ్/లీగల్

నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: స్ట్ఫా సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 2017లో నిర్వహించిన పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో ఏప్రిల్ 23వ తేదినాటికి దర్యాప్తుపై తాజా పురోగతి నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఆదేశించింది. న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, ఎస్‌ఏ నజీర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది. దేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లలో వివిధ స్థాయిల్లో సిబ్బందిని నియమించడానికి ప్రవేశ పరీక్షలను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్‌ఎస్‌సీ. 2017లో ఎస్‌ఎస్‌సీ నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష పత్రాల లీకేజీపై దర్యాప్తు చేయించాలని, ప్రశ్నాపత్రాలు లీకయినందున ఆ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. మంగళవారం కొద్ది సేపు సాగిన ఈ కేసు విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. కేసు దర్యాప్తు పురోగతి గురించి తెలపాలని కోర్టు గత విచారణ సందర్భంగానే సీబీఐని ఆదేశించిందని ధర్మాసనానికి చెప్పారు. ఈ విషయంలో తాము ఇప్పటికి మూడుసార్లు పురోగతి నివేదికలను సమర్పించామని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.
అయితే, కేసు దర్యాప్తులో పురోగతిపై తాజా నివేదికను సమర్పించాలని, ఆ నివేదిక ప్రతిని పిటిషనర్ తరపు న్యాయవాదికి కూడా అందజేయాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.