క్రైమ్/లీగల్

మాయావతికి సుప్రీంలో చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: బీఎస్‌పి అధినేత్రి మాయావతికి మంగళవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 48 గంటల పాటు తాను ప్రచారం చేయకుండా ప్రధాన ఎన్నికల సంఘం విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ మాయావతి దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రధాన ఎన్నికల సంఘం (సీఇసీ) తీసుకున్న నిర్ణయంపై పట్ల సుప్రీం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటీషన్‌ను అత్యవసరంగా పరిశీలించాల్సి ఉందని తాము భావించడం లేదని, అవసరం అనుకుంటే ఎన్నికల సంఘం ఆదేశాలపై విడిగా అప్పీలు చేసుకోవాలని మాయావతి తరపు న్యాయవాదికి కోర్టు సూచించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. ఉద్రేకపూరితంగా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై ఎన్నికల సంఘం సరైన విధంగానే చర్యలు తీసుకుంటున్నదని బెంచ్ పేర్కొంది. కాబట్టి ఈసీ విధించిన నిషేధంపై ఇప్పుడు ఎటువంటి తదుపరి ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఎన్నికల్లో ఉద్రేకపూరితమైన, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాన ఎన్నికల సంఘం సోమవారం నలుగురు నాయకుల ప్రచారంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బీఎస్‌పీ అధినేత్రి మాయావతిపై 48 గంటల పాటు నిషేధం విధించింది. అదేవిధంగా కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రచారంపైనా 48 గంటలు నిషేధం విధించింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై 72 గంటలు నిషేధం విధించింది.