క్రైమ్/లీగల్

వీవీప్యాట్ల స్లిప్పులపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, ఏప్రిల్ 16 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూం పరిధిలో వీవీప్యాట్లకు సంబంధించిన స్లిప్పులు బహిరంగంగా లభ్యమవడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్వో, ఏఆర్వో, మరికొందరు బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. స్లిప్పులు ఎక్కడి నుండి వచ్చాయి. వాటిని ఎవరు గుర్తించారు, వాటి వెనకున్న వ్యక్తులు ఎవరు తదితర అంశాలపై విచారణ చేస్తున్నట్లు డి ఎస్పీ తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తేలిన వాస్తవాలతో కూడి నివేదికను జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని ఆయన వెల్లడించారు.