క్రైమ్/లీగల్

కారుతో బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 26: జిల్లా పోలీసు కార్యాలయం ఎదురుగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను ఢీకొట్టడంతో కారు నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. తొండంగికి చెందిన సిద్దా శ్రీనివాస్ అనే యువకుడు ఇంజినీరింగ్ విద్యను సూరంపాలెంలోని ఓ కాలేజీలో అభ్యసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ స్నేహితులు, స్నేహితురాళ్లతో కాకినాడ త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఓ హోటల్‌లో ఆదివారం ఫేర్‌వెల్ పార్టీ చేసుకున్నాడు. పార్టీ ముగించుకున్న తర్వాత హోటల్‌లో సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్నేహితులతో కలిసి ఎపి5డిసి 7879 అనే నంబరు గల కారులో రావడం గమనించిన కానిస్టేబుల్ శేషగిరి కారును ఆపే ప్రయత్నం చేశాడు. నిందితుడు శ్రీనివాస్ కారున ఆపకుండా కానిస్టేబుల్ కాలుపై ఎక్కించుకుంటూ వెళిపోయాడు. దీంతో కానిస్టేబుల్ శేషగిరి, సహచరులు గౌతమ్, హెడ్‌కానిస్టేబుల్ రాములుతో కలిసి కారును వెంబడించి నూకాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలోని బ్రిడ్జి వద్ద ఆపేందుకు ప్రయత్నించగా తిరిగి వారు కారుతో ఢీకొట్టారు. ఈ సంఘటనపై వారు ట్రాఫిక్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎస్పీ కార్యాలయం వద్ద కారును ఆపే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా కారును ఆపకుండా ట్రాఫిక్ కానిస్టేబుళ్లపై దూసుకుంటూ వేగంగా వెళిపోయాడు. ఈ సంఘటనను సీసీ టీవీలో వీక్షించిన ఎస్పీ విశాల్ గున్నీ నిందితుడ్ని తక్షణమే అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. దీంతో ఆదివారం కారుతో పరారైన శ్రీనివాస్‌ను సోమవారం తొండంగిలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు టూటౌన్ పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ మద్యం సేవించి కారును నడిపినట్టు చెప్పారు.