క్రైమ్/లీగల్

వృద్ధులపై సైకో వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, ఏప్రిల్ 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు. ఇద్దరు వృద్ధులపై దాడి చేయగా జూకంటి సమ్మయ్య (85) అక్కడికక్కడే మృతి చెందగా మరో వృద్ధురాలు బోల్ల రాజమ్మ, గాయాలతో బయటపడింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. చెల్పూరు గ్రామానికి చెందిన జూకంటి సమ్మయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సమ్మయ్య భార్య గతంలోనే మృతి చెందగా ఇద్దరు కుమారులు కూడా మృతి చెందారు. ప్రస్తుతం ఆయన మనుమడు రాజేందర్ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటి ముందు నిద్రిస్తున్న సమ్మయ్యపై గుర్తుతెలియని సైకో దాడి చేసి మెడ కోశాడు. కడుపులో కూడా కత్తిపోట్లు పడ్డాయి. మర్మాంగాలను కోసి కనిపించకుండా చేశాడు. సమ్మయ్య మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం ఆ వ్యక్తే సమీపంలో ఉన్న బోల్ల రాజమ్మ ఇంటికి వెళ్లి తలుపులు బాధడంతో ఆమె భయంతో తలుపులు తీయలేదు. దీంతో ఆ వ్యక్తి ఇంటి పైకప్పు పెంకులు తొలగించి ఇంట్లోకి ప్రవేశించి రాజమ్మపై దాడికి ప్రయత్నించి గొంతునొక్కే ప్రయత్నం చేశాడు. పరిస్థితిని గమనించిన ఆమె కిందపడి చనిపోయినట్లుగా నమ్మించింది. దీంతో దాడి చేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం బుధవారం ఉదయం దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వడిచర్ల గోవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిపై సమీక్షించారు. ఎస్పీ ఆర్.్భస్కరన్, భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్‌లకు సంఘటన వివరాలను తెలిపారు. వెంటనే వారు చెల్పూర్‌లో జరిగిన సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల పనా లేక ఎవరైనా బయటినుంచి వచ్చారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీసులు కూడా సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వృద్ధులపై సైకో దాడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.